అక్బరుద్దీన్ కామెంట్స్‌‌ను ఖండించిన కేటీఆర్.


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బుధవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలంటూ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా అక్బరుద్దీన్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు.


ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు.’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

4 views