అత్తింటి వేధింపులకు అల్లుడు బలి

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన చెన్నవేని వెంకటేశ్(28) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఆరేండ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి, అన్నదమ్ములు, మేనత్త నుంచి వెంకటేశ్​కు వేధింపులు ఎక్కువయ్యాయి. తనను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. పోలీస్​స్టేషన్​లోనూ ఫిర్యాదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించినా వాళ్ల తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం యువతి తల్లిదండ్రులతో జరిగిన గొడవలో వెంకటేశ్ పై చేయిచేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్.. ఊరి పెద్ద చెరువు దగ్గరకి వెళ్లి పురుగుల మందు తాగాడు.  తన చావుకు  కారకులైన అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని ఫోన్​లో వాయిస్ రికార్డ్ చేసి తన కుటుంబ సభ్యులకు సెండ్​ చేశాడు. వారు వెంటనే వెంకటేశ్​దగ్గరికి చేరుకొని కరీంనగర్ లో ఓ ప్రైవేట్​హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వెంకటేశ్​ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

7 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ