అద్దెకు భార్యలను... ఎక్కడో కాదు మన దేశంలోనే...


భారతదేశంలో మహిళలకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి కొత్తగా తెలియజేయాల్సి అవసరం లేదు. అంతే గాక మన దేశంలో మహిళలని ఆది పరాశక్తి తో పోల్చుతూ గుడిలో పూజలు కూడా చేస్తారు.

కానీ ఇదే దేశంలో మహిళలని అంగట్లో బొమ్మలు మాదిరిగా మహిళలను అమ్మేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.


మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో శివపురి అనే ఒక గ్రామం ఉంది. ఇక్కడ అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ కుటుంబాల వారసులు నివాసం ఉంటున్నారు.దీంతో కొంతమేర సంపన్నమైనటువంటి కుటుంబాలు తమకు నచ్చిన మహిళలతో శృంగారంలో పాల్గొనే హక్కు ఉంటుందని ఓ పిచ్చి శాసనాన్ని రాసుకొని ఇప్పటికీ పాటిస్తున్నారు.ఇందులో తమకు నచ్చిన మహిళకి సంవత్సరానికి రెండు లేదా మూడు లక్షల రూపాయలు చెల్లించి ఆమెని తమ వెంట తీసుకు వెళతారు.


ఇందుకుగాను 10 రూపాయల బాండ్ పేపర్ పై మహిళకు సంబంధించిన వ్యక్తులతో సంతకాలు కూడా చేయించుకొని లీగల్ గా అద్దెకు తీసుకుంటారు.మహిళని అద్దెకు తీసుకున్న తరువాత ఆమెకు జబ్బు చేస్తే వైద్యానికి కావలసిన పూర్తి బాధ్యతలను అద్దెకు తీసుకున్న వ్యక్తి భరించాల్సి ఉంటుంది.కానీ ఆమె గర్భం దాల్చితే మాత్రం అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు.భారతదేశపు పురాణాల్లో, ఇతిహాసాల్లో మహిళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి తెలిసిన వారు ఎవరైనా సరే ఈ విషయాలను వింటే ఖచ్చితంగా విస్తుపోతారు.


ఎవరో కొందరు డబ్బు పిచ్చితో, మదపిచ్చితో రాసినటువంటి శాసనాలను ఇప్పటికీ పాటిస్తూ ప్రజలు తమ అనైతికతను కోల్పోతున్నారని కొందరు సోషలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇదంతా ప్రభుత్వ అధికారుల పరిధిలోని జరుగుతుందని.


23 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ