అనాథాశ్రమంలో పెరిగి, 34 ఏళ్లకే ప్రధాని పదవి.


ప్రపంచమంతా ఒడిదొడుకులు నెలకొన్న ఈ సమయంలో మార్పుకు దారి చూపుతూ ముందుకు సాగుతున్న మహిళ సనా మారిన్ ఫిన్లాండ్‌ ప్రధాని దేశాన్ని నడిపించిన తీరుపై సనా ప్రశంసలు అందుకున్నారు.


ఫిన్లాండ్‌ నైరుతి ప్రాంతంలో ఉండే పిర్కాలా అనే చిన్నపట్టణంలో పుట్టి పెరిగారు మారిన్‌. తల్లి చనిపోయాక, తాగుబోతు తండ్రిని వదిలేసి అనాథాశ్రమంలో పెరిగారు సనా. అక్కడ లభించే సౌకర్యాలను వినియోగించుకున్నారు. చాలా చిన్న వయసు నుంచే ఆమె అనేక ఉద్యోగాలు చేశారు. అయితే ఆమె పెద్దగా తెలివైన విద్యార్ధిని కూడా కాదు.

“ఓ సాదాసీదా స్టూడెంట్‌’’ అన్నారు పిర్కాలాలో ఆమెకు చదువు చెప్పిన టీచర్‌ పాసి కెర్వినెన్‌. 20వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఆమెలో రాజకీయాలలో ప్రవేశించాలన్న ఆలోచనలు మొదలయ్యాయి. తనతోపాటు తన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా మెరుగుపరచాలన్నది ఆమె ఆలోచన.

3 views