అవి మతపరమైన యుద్దాలు ఎలా అవుతాయి... ఔను చరిత్ర వక్రీకరించబడింది నిజమే..?.. నాటి రాజ్యాల మధ్య యుద్దాల

నిద్రించే వాడిని లేపవచ్చు...కాని నిద్రిస్తున్నట్లుగా నటించేవాడిని లేపలేం అన్న సామెతను మనం తరచూ వింటుంటాం. డబ్బులు ఉరికే రావు అన్నట్లుగా మన పెద్దల నుంచి ఈ సామెత్తలు ఉరికినే పుట్టుకురాలేదు. గత చరిత్రను తిరగస్తే తమ సామ్రాజ్యాల విస్తరణ కోసం నాడు వివిధ రాజ్యాల మధ్య యుద్దలు జరిగాయి. అంతే తప్పా మతం పేరుతో ఎక్కడా యుద్దలు జరగలేదు. కానీ మన చరిత్రకారులు కొందరు ఘనులు అని చెప్పవచ్చు. వాస్తవ చరిత్రను తమకు నచ్చిన రీతిలో రాసి నేడు మతల మధ్య జరిగిన యుద్దాలుగా నాటి యుద్దాలను మార్చేశారు. నాడు జరిగిన యుద్దలు తమ సామ్రాజ్యాల విస్తరణలో భాగమే తప్పా మతం కోసం కాదని నాటి యుద్ద ఘటనలు తేటతేలం చేస్తున్నాయి. కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు చరిత్ర కారులు నాటి యుద్దాలను మత యుద్దాలుగా చిత్రీకరించడం వల్ల నేటికి కొన్ని శక్తులకు ఈ వక్రీకరణ చరిత్రనే ఆయుధాలుగా మారుతున్నాయి. నాటి యుద్దాలను సాకుగా చూపి నేటికీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి యుద్దాలలో ఒకటి హల్దిఘాట్ యుద్దం. ఈ యుద్దం యోక్క వాస్తవికత రెండు రాజ్యాల మ‌ధ్య విస్తరణ విషయంలో జరిగిన పోరు మాత్రమే. కానీ దీనికి మతరంగును పులిమారు. కానీ వాస్తవం ఏమిటో మనం ఒక్కసారి తెలుసుకొందాం.


హల్దిఘాటి యుద్ధం భారత చరిత్రలో హిందూ-ముస్లిం సంఘర్షణగా తప్పుగా చరిత్రకారులచే చిత్రికరించబడినది. కాని వాస్తవానికి రెండు వైపుల రాజుల సైన్యాలు హిందువులు, ముస్లింల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి. హల్దిఘాటి యుద్ధం మొఘల్ చక్రవర్తి అక్బర్, మేవార్ రాణా ప్రతాప్ మధ్య జరిగింది. హకీమ్ ఖాన్ సూరి అనే ముస్లిం సైనాధిపతి రాణా ప్రతాప్ సైన్యానికి నాయకత్వం వహించగా, అక్బర్ సైన్యాన్ని జైపూర్ రాజపుత్ర రాజు మన్ సింగ్ నాయకత్వం వహించినాడు. మొఘల్ సైన్యంలో సగం మంది రాజ్ పుత్ సైనికులు ఉన్నారు. రాణా ప్రతాప్ సైన్యంలో హకీమ్ నాయకత్వం లోని ఆఫ్ఘన్ పఠాన్ సైన్యం ఉంది. హకీమ్ ఖాన్ మహారాణా ప్రతాప్ తో కలసి మరియు అక్బర్‌ తన సైనాధిపతి మన్ సింగ్ తో కలసి పోరాడటం, హల్దిఘాటి యుద్ధం మతపరమైనది కాదు మొఘలాయి సామ్రాజ్య విస్తరణ కొరకు జరిపిన యుద్ధం అనే విషయాన్ని స్పష్టపరుస్తుంది.


హకీమ్ ఖాన్ సుర్ జీవిత చరిత్ర: హకీమ్ ఖాన్ సూరి, సుర్ వంశస్తుడు.సుర్ సామ్రాజ్యం స్థాపకుడు. షేర్ షా సూరి వారసుడు. ఖైసా ఖాన్ సూరి- బీబీ ఫాతిమా దంపతులకు డిల్లి లో జన్మించిన హకీమ్ ఖాన్ సుర్ ను హకీమ్ ఖాన్ సుర్ పఠాన్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు పఠాన్ హకీమ్ ఖాన్‌ ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించిన అక్బర్ హకీమ్ ఖాన్‌ను తనతో తీసుకెళ్ళి జైలులో పెట్టాడు. కొన్ని రోజుల తరువాత అక్బర్ ఆఫ్ఘనిస్తాన్ తెగలను కలవడానికి వెళ్తూ అతనిని రాజా మన్ సింగ్ ఆధీనం లో ఉంచాడు. హకీమ్ ఖాన్ మన్ సింగ్ నుంచి తప్పిచుకొన్నాడు. మన్ సింగ్ అతనిని వెతకడానికి బయలు దేరిన సమయం అది. ఆ సమయంలో మన్ సింగ్ పై హకీమ్ ఖాన్ దాడి చేసి అతని బట్టలు చించి గుర్రంపై ఉదయపూర్ కు పారిపోయాడు. అలా పారిపోయిన హకీమ్ ఖాన్ గుర్రంపై అపస్మారక స్థితిలో ఉదయపూర్ చేరుకున్నాడు. మహారాణా ప్రతాప్ సింగ్ ఇది గమనించి హకీమ్ ఖాన్ కు వైద్యం చేయించి అతని ప్రాణాలు కాపాడాడు.

ఇలా హకీమ్ ఖాన్ మొఘలుల సామ్రాజ్య విస్తరణకు అడ్డుగా నిలిచాడు. మహారాణా ప్రతాప్ సింగ్ కూడా మొఘలాయి సామ్రాజ్య విస్తరణ కు వ్యతిరేకం గా నిలిచాడు. ఈ ఇద్దరు కలసి మొఘల్ చక్రవర్తి కి వ్యతిరేకంగా పోరాడారు. మహారాజ రాణా ప్రతాప్ సింగ్, మొఘలాయి చక్రవర్తి అక్బర్ మద్య హల్దిఘాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లో హకీమ్ ఖాన్ మొఘలులకు వ్యతిరేకం గా పోరాడాడు. హకీమ్ ఖాన్ సుర్ తుపాకులు, ఫిరంగులతో యుద్ధాలు చేయడంలో నిపుణుడు. హకీమ్ ఖాన్ తన పూర్వీకుడు సికందర్ షా సూరి ఓటమికి మొఘలుల నుండి ప్రతీకారం తీర్చుకునేందుకు హల్దీఘాట్ యుద్ధంలో భాగస్వామి అయ్యాడు. అతను హల్దిఘాటి యుద్ధంలో ముందు ఉండి మహారాణా ప్రతాప్ సైన్యాన్ని నడిపించాడు. పష్తున్ యోధుడు, మహారాణా ప్రతాప్ సైన్యంలో జనరల్ అయిన హకీమ్ ఖాన్ సుర్ మహారాణా ప్రతాప్ తో కలసి మొఘల్ చక్రవర్తి అక్బర్ కు వ్యతిరేకంగా హల్దిఘాటి యుద్ధం 1576లో పోరాడి మరణించాడు. ఈ యుద్ధం లో మొఘల్ సామ్రాజ్య శక్తీకి వ్యతిరేకంగా ఆఫ్ఘన్ల సైన్యానికి అతను నాయకత్వం వహించాడు. హకీమ్ ఖాన్ రాణా ప్రతాప్ కోశాధికారిగా కూడా పనిచేశాడు. వాస్తవం ఇలావుంటే ఇది మతపరంగా జరిగిన యుద్దం ఎలా అవుతుంది. నిజంగా మతపరంగా సాగిన యుద్దమే అయితే చక్రవర్తి అక్బర్ తరఫున ఓ హిందూ సైన్యాధిపతి, అదే మేవార్ రాణా ప్రతాప్ తరఫున ఓ ముస్లిం సైనాధిపతి ఎందుకు పోరాడుతాడు. నిజంగా ఇది మత యుద్దమే అయితే అక్బర్ తరఫున హిందూ సైన్యాధిపతి మేవార్ రాణా ప్రతాప్ వైపు వచ్చేసేవాడు. అదే మేవార్ రాణా ప్రతాప్ తరఫున ఉండే హకీం ఖాన్ సూరి అక్కడి నుంచి అక్బర్ వైపునకు వచ్చేసి ఉండాలి కదా...? అందుకే చరిత్ర వక్రీకరించబడిందని నిస్సందేహంగా చెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఇదిలావుంటే మేవార్ చరిత్రలో హకీమ్ ఖాన్ సూరి ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. అతని పేర మహారాణా మేవార్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించబడినది. 2017 హకీమ్ ఖాన్ సుర్ అవార్డు E.SRIDHARAN E. శ్రీధరన్ (మెట్రోమ్యాన్) కు లబించినది. ప్రతి సంవత్సరం ఆయన స్మారక చిహ్నం ఉన్న హల్దిఘాటిలో అతని స్మారక ఉత్సవం జరుగుతుంది.