అంబేద్కర్ భవన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అంబేద్కర్ భవన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం పట్టణ ప్రముఖుడైన షేక్ జమాల్ బాషాను దుస్సాలువా పూలమాలలతో సత్కరించిన దళిత చైతన్య స్రవంతి సభ్యులు. గురువారం సాయంత్రం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో భారత రాజ్యాంగ విశిష్టతను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖ రాజకీయవేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయిన షేక్ జమాల్ బాషా ముఖ్యఅతిథిగా హాజరైన సభా కార్యక్రమానికి సామాజిక చైతన్యకారుడు, విద్యావంతుడు షేక్ జబ్బార్ అధ్యక్షత వహించారు. జమాల్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు.

3 views