ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ వాయిదా ?


ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఈసారి రెండు వారాల పాటు వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగే ఈ టెన్నిస్ టోర్నీ సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 18వ తేదీన ప్రారంభం అవుతుంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో టోర్నీని ఒక‌టి లేదా రెండు వారాల పాటు వాయిదా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టోర్నీ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వ, టెన్నిస్ అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు విక్టోరియా క్రీడాశాఖ మంత్రి మార్టిన్ ప‌కులా తెలిపారు. టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించి చాలా తేదీల‌ను స‌మాలోచిస్తున్నామ‌ని, బ‌హుశా టోర్న‌మెంట్‌ను ఒక‌టి లేదా రెండు వారాల పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్న‌ట్లు ప‌కులా తెలిపారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద ఇదొక‌టే ఆప్ష‌న్ ఉంద‌ని, ఫ్రెంచ్ ఓపెన్‌ను ఈసారి కొన్ని నెల‌ల పాటు వాయిదా వేశార‌ని, ఇక వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అస‌లు జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

4 views