ఆంధ్రప్రదేశ్ దీపావళి వేడుకల్లో విషాదం..!

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దీపావళి వేడుకలు కొన్ని చోట్ల విషాదంగా మారాయి. కృష్ణ జిల్లాలోని బాపులపాడు మండలం వీరవల్లిలో బాణసంచా కాలుస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్ కు చెందిన రాజేశ్, రంజీత్ లు శనివారం రాత్రి వీరవల్లిలో దీపావళి పటాకలు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో రాజేశ్ కుమార్, రంజిత్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నూజివీడు ఆసుపత్రికి తరలించే లోపే రాజేశ్ కుమార్ మృతి చెందాడు. రంజిత్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీనర్సాపురంలో కోళ్ల ఫాం లో అగ్నిప్రమాదంలో జరగగా సుమారు 1200 కోళ్లు మృతి చెందినట్లు సమాచారం.

5 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ