ఇస్లాంలో విద్యకు అధిక ప్రాధాన్యత... ప్రవక్త(స) విద్యావిధానం

ఇస్లాం ప్రగతికి చిహ్నం..ఈ విషంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఇస్లాం అంటే మూడత్వం, ప్రగతి నిరోధకం అన్న దుష్ప్రచారముంది. వాస్తవానికి ఏ మతమైన విద్యకు పెద్దపీటవేస్తే ఆ సమాజం ఎలా మూడత్వానికి నిదర్శనమవుతుంది. విద్యకు పెద్దపీట వేసిందంటే ఆ మత పురోగతిని సూచింస్తుందని అర్థం. వాస్తవానికి ఇస్లాం విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. స్వయంగా ముహమ్మద్ ప్రవక్త (స) విద్య యోక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. జ్ఞానం(విద్య) ను పొందు..నీవు పొందిన జ్ఞానం(విద్య)ను మందికి పంచిపెట్టు అంది ఇస్లాం. అంటే నీవు చదవిందే కాదు దానిని ఇతరులకు కూడా కచ్చితంగా బోధించు అని ఇస్లాం తఖీదు చేసింది. అంటే సంపూర్ణ విద్యతోనే ప్రగతి అని ఇస్లాం వాస్తవికతతో చెప్పింది. రాజ్యాలు గతించి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చి కూడా నేడు ఇవే విషయాలను చెబుతున్నాయి. ఎపుడో వేల సంవత్సరాల కిందటే ఇస్లాం విద్య యోక్క ప్రాధాన్యత నొక్కి చెప్పింది. ముహమ్మద్ ప్రవక్త (స) బదర్ యుద్ధం లో చిక్కిన యుద్ధ ఖైదీల(బందీలు)లలో చాలా మంది అక్షరాస్యులు ఉన్నారు. వీరు తమ విడుదల కోరుకొన్నపుడు ముహమ్మద్ ప్రవక్త (స) వారు ఒక షరత్తు పెట్టారు. విడదల అయ్యే అక్షరాస్యులైన యుద్ద ఖైదీలు ప్రతి ఒక్కరూ మదీనాకు చెందిన పది మంది పిల్లలకు చదవడం, వ్రాయడం నేర్పించాలని ముహమ్మద్ ప్రవక్త (స) వారు కోరారు. ముస్లింలు ఒకప్పుడు జ్ఞానం లో అగ్రభాగాన ఉండేవారు. ప్రపంచం మొత్తం ముస్లిం సమాజం వైపు చూసింది. ప్రవక్త (స) సమయంలో మదీనా నగరం యొక్క విద్యావ్యవస్థను పరిశీలిద్దాం. ఇస్లాం యొక్క ప్రారంభ దశలో మక్కా నగరంలో మొత్తం విద్య వ్యవస్థ యొక్క పునాదులు వేయబడ్డాయి. మక్కాలో వెల్లడైన పవిత్ర గ్రంథంలోని ఆయతులలో ఇది ప్రతిబింబిస్తుంది, అవి చదవడానికి, వ్రాయడానికి సంబంధించినవి. మదీనా యొక్క ఆయతులు బోధనల యొక్క చర్య మరియు అమలుకు ప్రాధాన్యతనిస్తాయి. ప్రవక్త (స) రాక లో ప్రధాన ఉద్దేశం బోధించడమేనని గమనించాలి. బోధించడం బోధనలో ఒక భాగం. వలస (హిజ్రా) కు రెండు సంవత్సరాల ముందు ఆచరణాత్మక చర్య తీసుకోబడింది. మదీనా నుండి వచ్చిన కొంతమంది ఇస్లాం స్వీకరించినప్పుడు, వారు ఖురాన్ బోధించగలిగే ఒక గురువును తమతో పాటు పంపాలని, ఇస్లాం, దాని మతపరమైన ఆచారాలను బోధించాలని ప్రవక్త (స)ను అభ్యర్థించారు. మదీనాలో బోధించడానికి సాద్ ఇబ్న్ అల్ ఆస్ (ర) ను నియమించబడారు. మదీనాలోని ప్రవక్త (స) మసీదుతో అనుసంధానించబడిన ఆవరణ సుఫా. ఇది ప్రయాణికులు, స్థానికులలో మిక్కిలి పేదవారు ఆశ్రయం పొందటానికి కేటాయించబడింది. అదే సమయంలో సుఫా ఒక సాధారణ నివాస పాఠశాల, ఇక్కడ చదవడం, రాయడం, ముస్లిం షరియా (చట్టం), ఖురాన్ జ్ఞాపకం చేసుకోవడం, తాజ్‌వీద్ (ఖురాన్ సరిగ్గా పఠించడం), ఇతర ఇస్లామిక్ శాస్త్రాలు ప్రవక్త (స) పర్యవేక్షణలో బోధించబడ్డాయి. విద్యార్థులు తమ విరామ సమయం లో పనిచేయడం ద్వారా జీవనం సాగించారు. ఇది డే-స్కాలర్స్ మరియు అధిక సంఖ్యలో హాజరు అయ్యే సందర్శకుల కోసం ఒక అభ్యాస కేంద్రం. దాదాపు డెబ్బై మంది మంది విద్యార్ధులకు ఇక్కడ హాస్టల్ వసతి కల్పించబడినది.. దూరపు తెగల విద్యార్థుల బ్యాచ్‌లు వచ్చి తమ కోర్సు పూర్తి చేయడానికి అక్కడే ఉండి కోర్స్ పూర్తి చేసి తిరిగి తమ దేశానికి తిరిగి వెళ్ళేవారు.. వారి దేశంలో లేదా తెగలో విద్యను నిర్వహించడానికి సహాయం చేయడానికి ప్రవక్త (స) తన సహచరులలో ఒకరిని వారితో పాటు పంపేవారు. మదీనాలో సఫా మాత్రమే కాదు, కనీసం తొమ్మిది ఇతర మసీదులు పాఠశాలలుగా పనిచేసేవి. స్థానిక ప్రాంతవాసులు తమ పిల్లలను ఈ పాఠశాలలకు పంపేవారు. ప్రవక్త (స) మదీనా ప్రజలను తమ పొరుగువారి నుండి నేర్చుకొని బోధించమని ప్రోత్సహించారు. ప్రవక్త (స) తన మసీదులోని అధ్యయన కేంద్రాలను తరచూ పరిశీలించేవారు. వాటిలో ఏదైనా లోపం కనుగొంటే దానిని తక్షణమే సరిదిద్దేవారు. దివ్య ఖురాన్, సున్నత్ లలో ఎక్కువ నేర్చుకున్నవారు మాత్రమే మతపరమైన సేవలను నిర్వహించాలని ప్రవక్త(స) ఆదేశించారు. అందువల్ల ప్రజలు రాజ్య ఆధీనంలోని పాఠశాలలలో ప్రవేశం పొందటానికి, అందులో విద్యనేర్చుకొని ఉత్తీర్ణత సాధించడంలో ఒకరితో నొకరు పోటీ పడేవారు. ప్రవక్త(స) స్పెషలైజేషన్ అవసరమని భావించారు. దానిని బాగా ప్రోత్సహించారు. దివ్య ఖురాన్, తాజ్‌వీడ్ (Tajweed), గణితం లేదా లా నేర్చుకోవడం వంటి విషయాలలో ప్రత్యేకత కోరితే అలాంటివారికి లేదా అలాంటి వ్యక్తికి సహాయం చేయమని ఆయన అధ్యాపకులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల నుండి ఎటువంటి పారితోషికాన్ని స్వీకరించవద్దు అని ఉపాధ్యాయులను ప్రవక్త (స)ఆదేశించారు. ఉబాదా ఇబ్న్ అల్ సమిత్ (ర) ప్రకారం అతను సుఫాలో ఖురాన్ రాయడం నేర్పించాడని, అతని విద్యార్థులలో ఒకరు అతనికి విల్లును బహుమతిగా ఇచ్చారని వివరించాడు. అయితే దానిని స్వికరించవద్దని ప్రవక్త (స) సూచించారు. ప్రవక్త (స) గారికి రాజ్యఅధిపతిగా విదేశీ భాషలను తెలిసిన వ్యక్తులు అవసరం. జైద్ ఇబ్న్ థాబిట్ (రా) పెర్షియన్, గ్రీకు, ఇథియోపియన్, అరామిక్ భాషలను నేర్చుకున్నట్లు తెలుస్తుంది. ఒక సందర్భంలో ప్రవక్త(స) కు హిబ్రూ తెలిసిన వ్యక్తి యొక్క అవసరం వచ్చినప్పుడు, అతడు దానిని కొన్ని వారాలలో నేర్చుకున్నాడు. జైద్ (ర)ప్రవక్త (స) గారి తరుఫున లేఖలు రాసేవారు. అందుకున్న లేఖలను చదివేవారు. అప్పట్లో ఉన్న సిలబస్ లేదా కోర్సు అన్ని పాఠశాలల్లో ఏకరీతిగా లేదని తెలుస్తుంది. ఉపాధ్యాయుడు నిర్దిష్ట పాఠశాల వ్యవస్థలో ప్రధాన భాగం గా ఉండేవాడు. దివ్య ఖురాన్, సున్నత్ లతో పాటు, ప్రవక్త (స) షూటింగ్, ఈత, వారసత్వ విభజన యొక్క గణితం (mathematics of division of heritage), ఔషధం/మెడిసిన్, ఖగోళ శాస్త్రం, వంశవృక్షం (genealogy) కోసం బోధకులను ఏర్పాటు చేశారు. బాలికలు కూడా పాఠశాలలకు హాజరుయ్యేవారు. వాస్తవానికి, ప్రవక్త (స) ప్రతి బుధవారం మహిళలకు ప్రత్యేకంగా ఉపన్యాసాలు ఇచ్చి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేవారు. స్పిన్నింగ్ ప్రత్యేక వృత్తిగా మహిళలకు నేర్పించబడింది. ప్రవక్త(స)తన భార్యలలో ఒకరికి వ్రాసే కళను నేర్పించమని ఒక మహిళను కోరారు. వాస్తవానికి ప్రవక్త(స) భార్య అయేషా (ర) ఫిఖ్, ముస్లిం శాస్త్రాలు, కవిత్వం, ఔషధం/మెడిసన్ లో రాణించారు. ప్రవక్త(స) మదీనా నుండి ఉపాధ్యాయులను ఇతర ముఖ్యమైన విద్యా కేంద్రాలకు పంపారు. స్థానిక పాఠశాలల నిర్వహణ, నియంత్రణకు ప్రాంతీయ గవర్నర్లు బాధ్యత వహించేవారు. శాస్త్రాలు, ఖురాన్, హదీసులు మరియు ఫిఖ్ లలో ఉపాధ్యాయుల నియామకం తో సహా గవర్నర్ల నిర్వహించవలసిన విధులను లిఖితపూర్వకంగా ప్రవక్త(స) తెలియజేసారు. విద్య యొక్క నాణ్యతను పెంచడానికి, ప్రవక్త (స) వివిధ జిల్లాలు మరియు ప్రావిన్సులలో పాఠశాలలు మరియు ఇతర విద్యా సంస్థలను పర్యవేక్షించే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను నియమించారు. నిరక్షరాస్యత, అమానవీయ ప్రవర్తనా జీవన విధానానికి ప్రసిద్ది చెందిన అరబ్బుల కాలం లో ఇటువంటి వ్యవస్థ నిర్మించడం గొప్ప పురోగతి! విద్యను వ్యవస్థీకృత మరియు క్రమబద్ధమైన విధానంలో తీసుకు రావడంలో ప్రవక్త(స) తన ఆసాధారణమైన దూరదృష్టిని ప్రదర్శించారు.