ఇంట్లో నాన్ వెజ్ వండారని సూసైడ్ చేసుకున్నయువకుడు


ఇంట్లో నాన్ వెజ్ వండారని ఓ యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. రొంపికుంటకు చెందిన తోట లక్ష్మణ్(26)కు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు. ఇంట్లో వండినప్పుడల్లా గొడవపడి బయటికి వెళ్లిపోయి.. తిరిగి వచ్చేవాడు. ఈ మధ్యే అతని నానమ్మ వృద్ధాప్య సమస్యలతో మరణించగా.. కర్మకాండ రోజున ఈ నెల 14 న నాన్ వెజ్ వండారని గొడవపడ్డాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ శుక్రవారం సుల్తానాబాద్ లోని చెరువు దగ్గరికి పోయి పురుగుల మందు తాగాడు. మందు తాగిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఇన్ఫామ్ చేరు. పోలీసులు వెంటనే లక్ష్మణ్ కు ప్రభుత్వ ఆస్పత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేయించి కరీంనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ లక్ష్మణ్ శనివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

15 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ