ఏపీలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణి ఎలా జరగనుంది...


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు..

దాన్ని ఎలా ప్రజలకు అందించాలో , అందుబాటులో ఉన్న విధానాలేంటో వాటిపై ఫోకస్ పెట్టమన్నారు. వ్యాక్సిన్ ను స్టోర్ చేయడంలో తలెత్తే సమస్యను గుర్తించాలి అని, టీకా నిల్వకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా, వాటిని రవాణా చేయడానికి విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. మారుమూల గ్రామాల్లోకి కూడా టీకా సరఫరా అయ్యేలా చూడాలి అన్నారు. త్వరలో దీనిపై సమీకా సమావేశం ఉంటుంది అని తెలిపారు.

3 views