ఒంగోలు జాతి పశు సంపద సంరక్షణ మన బాధ్యత : మన లోకల్ MP లావు శ్రీకృష్ణదేవరాయలు గారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మన రాష్ట్ర పశు సంపద ఒంగోలు జాతి అభివృద్ధి విషయమై.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు..కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అటల్ చతుర్వేది గారిని ..ఢిల్లీలో కలిశారు. _గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం, నర్సింగ పాడులో గల కేంద్ర ప్రభుత్వ ఎద్దుల పెంపక కేంద్రం( యంగ్ బుల్ రేరింగ్ సెంటర్) నందు ఒంగోలు జాతిని అభివృద్ధి చేయుటకు తోడ్పాటు ఇవ్వాలి. ఈ సెంటర్ ఏపీ పశువుల అభివృద్ధి సంస్థ నిర్వహణలో ఉంది, ఇది ప్రభుత్వ సహకారంతో ఏర్పడిన సొసైటీస్ యాక్ట్ 1999 కింద నమోదు చేయబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. పశువులు, గేదెల పెంపకం కోసం జాతీయ ప్రాజెక్ట్ (ఎన్‌పిసిబిబి) క్రింద భారతదేశం, ఆంధ్రప్రదేశ్ సహకరించింది. సుమారు 500ఎకరాలకు పైగా సువిసాలంగా అన్ని వసతులతో విస్తరించి ఉన్న కేంద్రంలో ఒంగోలు జాతిని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలి, రాష్ట్ర రైతుల కు మేలు జరిగేలా చూడాలి. మన ఒంగోలు బ్రీడ్ తో బ్రెజిల్ దేశం ఎంతో లాభాలను గడిస్తుందని.. సాంకేతికతను వినియోగించి అధిక పాల దిగుబడులు (రోజుకి ఒక్కో ఆవు 30 నుంచి 40లీటర్లు ఇస్తుంది) సాధిస్తున్నారు. మన దేశంలో సరైన చర్యలు లేకపోవటంతో.. ఈ జాతి తగ్గుతుందని.. ప్రస్తుతం 2లక్షల ఒంగోలు జాతి పశు సంపద మిగిలి ఉంది. ఆదాయాలు గడించి పెట్టే..గుంటూరు, ప్రకాశం ప్రాంతాల ఈ గొప్ప ఒంగోలు జాతి సంపదను నర్సింగ పాడు వద్ద గల పశు పెంపక కేంద్రంలో అభివృద్ధి చేయుటకు, బ్రెజిల్ దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు.. ప్రాజెక్ట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర కార్యదర్శిని కోరారు_

1 view