కరోనావ్యాక్సీన్ ఎప్పుడు? ధర ఎంత?


కొన్ని నెలల్లోనే వ్యాక్సీన్ తయారు కావొచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు కోవిడ్-19 వ్యాక్సీన్ ధర ఎంత ఉంటుంది? వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని డోసుల వ్యాక్సీన్ అవసరం అవుతుంది? తదితర ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి.

కోవిడ్‌ నుంచి రక్షణ కోసం తాము తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ 95% ఫలితాలనిచ్చిందని అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా ప్రకటించింది.

ఇటీవలే ఫైజర్‌ కంపెనీ కూడా తమ వ్యాక్సీన్‌ 90%శాతం పని చేస్తోందని ప్రకటించిన నేపథ్యంలో మోడెర్నా సంస్థ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ రెండు కంపెనీలు తమ వ్యాక్సీన్ పరిశోధన కోసం వినూత్నమైన రీతిలో ప్రయత్నాలు చేశాయి.

ఈ రోజు తమకు వచ్చిన ఫలితాలను ఎంతో విశేషమైనవని, రాబోయే కొద్ది వారాల్లో వ్యాక్సీన్‌ తయారీకి ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామని మోడెర్నా తెలిపింది.

తమ వ్యాక్సీన్ 33 నుంచి 37 డాలర్ల (దాదాపు రూ.2,500) మధ్యలో ఉంటుందని గత ఆగస్టులో మోడెర్నా వెల్లడించింది.

వ్యాక్సీన్‌ను వీలైనంత తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించినట్లు కేంబ్రిడ్జ్‌కు చెందిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టీఫెన్ బాన్‌సెల్ వివరించారు.

''అందరికీ ఈ వ్యాక్సీన్ అందాలని కంపెనీ భావిస్తోంది. అందుకే వీలైనంత తక్కువగా ధరను ఉంచాలని మేం భావిస్తున్నాం''

4 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ