కూతురు పెళ్లి కోసం దాచిన 9.20 లక్షలు బూడిద

అగ్ని ప్రమాదం రెండు కుటుంబాలను నడిరోడ్డుపై పడేసింది. సోమవారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్‌కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన ఇంట్లో రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కూతురు వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతో పాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

9 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ