కేంద్రంలో సంచలన నిర్ణయం..! వారికి కూడా ఉచితంగా రేషన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్, కుష్టి, ఎయిడ్స్ వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లకు శుభవార్త చెప్పింది. ఇకపై వీళ్లకు కేంద్రం ఉచితంగా రేషన్ పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై క్యాన్సర్, కుష్టి, ఎయిడ్స్ రోగులు ఉచితంగా రేషన్ ను పొందవచ్చు. భారతదేశంలో దారిద్రరేఖకు దిగువన ఉన్నవాళ్లు మాత్రమే రేషన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రజలకు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటి. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం, కంది బేడలు, ఇతర నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరతో పోల్చి చూస్తే తక్కువ ధరకే సొంతమవుతాయి. సుప్రీం కోర్టు కొన్ని రోజుల క్రితం సెక్స్ వర్కర్లకు ఉచితంగా రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సెక్స్ వర్కర్లతో పాటు పలు వ్యాధులతో బాధ పడే వాళ్లకు సైతం ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులతో బాధ పడే వాళ్లకు ఉచిత రేషన్ ను పంపిణీ చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఉచిత రేషన్ పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సుప్రీం కోర్టు సెక్స్ వర్కర్లకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయగా డీలర్లు సెక్స్ వర్కర్ల వివరాలను బయటకు వెల్లడించకూడదు. మోదీ సర్కార్ ప్రాణాంతక వ్యాధులతో బాధ పడే వాళ్లకు ఫ్రీగా రేషన్ ను పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని దేశంలోని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

8 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ