ఖండించే కలం కి భద్రత లేదా?*నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్* ‘కత్తి కన్నా కలం గొప్పది’ అంటారు. ఆ కలం ఇప్పుడు మూగబోతుంది. కలం ఉప్పెనకి కొందరు ఉన్మాదులు అడ్డుకట్ట వేస్తున్నారు. నోరు తెరిస్తే చంపేస్తున్నారు. నిజం రాస్తుంటే నిర్జీవులుగా చేస్తూన్నారు. జర్నలిజాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు. ఇటీవల యునెస్కో ప్రకటించిన నివేదిక కనీవిని ఎరుగని నిజాలని బయట పెట్టింది. అందర్నీ ఆందోళనకి గురిచేసింది, ఆలోచనలో పడేసింది. ఆ నివేదిక ఏం చెప్పింది అనుకుంటున్నారా.. ప్రతి నాలుగున్నర రోజులకి ఓ జర్నలిస్ట్‌ ని చంపేస్తున్నారు. గడచిన దశాబ్దంలో 827 మంది జర్నలిస్టులను చంపేశారు సిరియా, ఇరాక్, యెమెన్, లిబియా, లాటిన్ అమెరికాల్లో ఈ హత్యలు జరిగాయిని వాళ్ళలో 59 శాతం మంది హత్యకి గురయ్యారని యునెస్కో నివేదిక వెల్లడించింది. అరబ్ దేశాల్లోనే ఎక్కువగా హత్యకు గురయ్యారు. పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికాలో కూడా జర్నలిస్టుల హత్యలు జరుగుతున్నాయి. విదేశీ జర్నలిస్టుల కన్నా లోకల్ జర్నలిస్టులకే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదికలో ఉంది. మహిళా జర్నలిస్టులు కూడా బలైపోతున్నారు. జర్నలిస్టులను అపహరించడం, హింసించి చంపడం వంటి ఘటనలు పెరిగాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది. అలాంటి జర్నలిజం ను ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జర్నలిస్టులు ఆర్థికంగా, వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నారు. అటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా నామమాత్రపు చేయూత మాత్రమే లభిస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ముఖ్య లక్ష్యంగా ఆవిర్భవించిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) జర్నలిస్టుల సమస్యలపై, జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది. జర్నలిస్టులపై దాడులు నివారణకు నిరోధక కమిటీ మరియు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని,జర్నలిస్టులపై దాడులు జరిగితే నాన్ బెయిలబుల్ వారెంట్ తో కూడిన కఠిన చట్టాలు తీసుకువచ్చి దాడులు అరికట్టాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు డిమాండ్ చేశారు.

1 view

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ