గంగా నదిలోకి 30 ఘరియల్ మొసళ్లు


ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ అధికారులు 30 ఘరియల్ మొసళ్లను బిజ్నోర్ సమీపంలో గంగా నదిలో విడిచిపెట్టినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు.

సన్నటి, పొడవాటి నోరు ఉండే ఘరియల్ మొసళ్లు అంతరించిపోయే దశకు చేరుకున్నట్టు యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గుర్తించింది. వాటిని సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది.


డబ్ల్యుూడబ్ల్యుూఎఫ్ నుంచి శిక్షణ పొందిన గంగమిత్ర సంఘం ఈ ప్రాంతంలో ఘరియల్ మొసళ్లు, తాబేళ్ల సంరక్షణ కోసం కృషిచేస్తోంది.


మొట్టమొదట 2009లో ఈ ప్రాంతంలోని గంగా నదిలో ఘరియల్ మొసళ్లను విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 818 మొసళ్లను ఇక్కడకు తీసుకొచ్చారు.

9 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ