చెంచులకు భూముల విషయంలో నిధులు విడుదల చేయాలని ట్రైకార్ ఎండి ని కలసిన నవతరం పార్టీ,గిరిజన నాయకులు.


గిరిజన సామాజిక వర్గీయులకు చెందిన చెంచులకు భూములను స్వాధీనం చేసేందుకు నిధులు విడుదల చేయాలని శుక్రవారం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం విజయవాడలో గిరిజన సంక్షేమ శాఖ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి రవీంద్ర బాబు ను కలసి వినతిపత్రాన్ని అందించారు.నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాసిన లేఖను జతపరచారు. గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీనునాయక్ మాట్లాడుతూ త్వరగా నిధుల కేటాయింపు చేయాలని 3 సంవత్సరాల కాలంగా సమస్య పరిష్కారం కాలేదని ఎండి రవీంద్ర బాబుకు తెలిపారు. కార్యక్రమంలో చెంచులక్ష్మి సంఘం జిల్లా అధ్యక్షులు ఆవల వెంకటేశ్వర్లు, మల్ల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

4 views