చిలకలూరిపేట నుండి పర్వతారోహణ వరకు తన ఆశయ సాధనలో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు పొందిన సాయికిరణ


అది అత్యంత ఎత్తైన పర్వతాలు. ఎముక‌లు కొరికే చలిలో సిలిండ‌ర్ లాంటి ఆక్సీజ‌న్ ట్యాంక్ బ‌రువును భుజాన వేసుకుని శిఖ‌రాల‌ను సునాయ‌సంగా అధిరోహిస్తున్నాడు. అదే అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించి పెట్టింది. అలాంటి అతను ఓ సాధారణ కూలీ కొడుకు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద నేపథ్యం అతనిది. చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ నివాసి అయిన అతను అందరిలో ఒకడిలా మిగిలిపోకుండా అందనంత ఎత్తుకు ఎదగాలనుకున్నాడు. ఎత్తైన పర్వతాలు అధిరోహించి మౌంటెనీర్‌‌ కావాలనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అధిరోహిచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తున్నా ముందుకు సాగిన ఆ యువకుడు ఆత్మ‌విశ్వాసంతో మొక్క‌వోని దీక్ష‌తో విశ్ర‌మించ‌కుండా అనుకున్న ల‌క్ష్యాల‌ను ఛేధించుకుంటూ వెళుతూ ల‌క్ష్యాన్నికి మ‌రికొద్ది దూరంలోనే ఉన్నా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు సాధించి ఆ యువకుడి పేరు సాయికిర‌ణ్. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతం లోని మద్దినగర్ కు చెందినా ఈ 20 ఏళ్ల యువకుడు త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం ... విద్య‌ను అందించే గురువులు ... క‌ళాశాల యాజ‌మాన్యం ఆదరాభిమానాలు .. మిత్రులు అందించిన ఉత్సాహం తో తన ధైర్యసాహసాలతోతన వూరికి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తెస్తున్నాడు.

14 views

Recent Posts

See All