చిలకలూరిపేట లో అస్తవ్యస్తం గా రోడ్లు, ఇబ్బందుల్లో ప్రజలు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా అమృత్ పధకం ద్వారా పట్టణ ప్రజలందరికి మంచి నీటిని అందించాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి . ఈ ప్రాజెక్ట్ 139 కోట్ల కు మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా పైప్ లైన్స్ కొరకు అన్ని రోడ్లు తవ్వడం జరుగుతున్నది.

కానీ సరైన ప్రమాణాలు, ప్రణాళిక మరియు స్థానిక ప్రజలకు ముందస్తు సూచనలు లేకపోవటం వలన రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి . మెగా సంస్థ పైప్ లైన్ వేసిన తరువాత వాటిని పూడ్చటానికి ఫ్లై ఆష్ ని వాడటం వలన దుమ్ము ధూళి కలిసి పొగమంచు లాగా ఏర్పడి ప్రజలందరికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నది. అదే వర్షం పడితే రోడ్లు మొత్తం బురద బురదగా ఉంటున్నవి. కాంట్రాక్టు ప్రకారం సంవత్సరం లోగా రోడ్లు మొత్తం మరమత్తు చేయాలి, మరి అప్పటి వరకు ప్రజలు ఈ ఇబ్బందులనుండి ఎలా బయటపడతారో చూడాలి.


సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లు మరమత్తులు త్వరితగతిన జరిగేట్టు చూడాలి అని ప్రజలు , ప్రజా సంఘాలు , అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నారు .

6 views