డ్రగ్స్‌ వ్యవహారంలో కమెడియన్‌ భర్త అరెస్ట్‌


నిషేధిత మత్తు మందు తీసుకున్నారనే సమాచారంతో హాస్యనటి భారతీ సింగ్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) నిన్న ఉదయం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం భారతీ సింగ్‌, ఆమె భర్త హర్ష్‌ను ముంబైలోని ఎన్సీబీ ఆఫీస్‌కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.


సుమారు 15 గంటల విచారణ తర్వాత హర్ష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ విచారణాధికారి సమీర్‌ వాంఖేడ్‌ తెలిపినట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది.

8 views