తన ఆరోగ్యంపై షాకింగ్ నిజాలను బయటపెట్టిన రానా..


రానా ఇటీవల తన ప్రేయసిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైయాడు. అంతేకాదు తాజాగా తన హనీమూన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తిచేసుకుని ప్రస్తుతం పెండింగ్’లో ఉన్న తన సినిమా పనుల్ని చక్కదిద్దుతున్నాడు. అది అలా ఉంటే ఆయన తాజాగా సమంత టాక్ షో సామ్ జామ్‌కు అటెండ్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై రానా స్పందించాడు. తనకు పుట్టినప్పటి నుంచి బీపీ ఉందని, దీనివల్ల గుండె సమస్య తలెత్తుతుందని పేర్కొన్నాడు. ఈ సమస్య వల్ల కిడ్నీలు పాడవుతాయని వైద్యులు చెప్పారని పేర్కోన్నాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ... మెదడులో నరాలు చిట్లిపోవడానికి (స్ట్రోక్ హెమరేజ్) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందంటూ వైద్యులు చెప్పారని తెలుపుతూ.. రానా కంటితడి పెట్టాడు. తన జీవితం వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఓ చిన్న పాజ్ వచ్చిందని పేర్కోన్నాడు. దీంతో సమంత కూడా భావోద్వేగానికి గురైంది.


5 views