తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్‌


పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది.

3 views