తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి పాదయాత్రలో CM జగన్ ఫిజియో.


తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ని ఎంపిక చేసిన జగన్! తన సొంత ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తిని ఎంపిక చేయడం చూస్తే జగన్ తనను నమ్ముకున్న వ్యక్తికి పట్టం కడతారన్నది మరోసారి రుజువయ్యింది! చారిత్రాత్మకమైన పాదయాత్రలో జగనన్న వెన్నంటి ఉంటూ, ఫిజియో సేవలందించిన గురుమూర్తి చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన వాడు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్‌ కాళ్ల నొప్పుల నివారణకు చిట్కాలు చెప్పడం,ప్రతి రోజూ జగన్‌ తాను బస చేసిన బస్సులోకి ప్రవేశo కోసం కాచుకుని ఉండి, ఆయన పాదాలను రక్షించే బాధ్యతలు నిర్వర్తించే వారు గురుమూర్తి! ఈ క్రమంలో తన ఫీజియో సేవలతో ‘గురు’ జగన్‌ను బాగా ఆకట్టుకుని, దగ్గరయ్యారు. ఇటీవల కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు మృతి చెందడంతో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి దుర్గాప్రసాద్‌ సతీమణి విముఖత చూపడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. తనకు బదులు తన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి తిరుపతి టికెట్‌ ఇవ్వాల్సిందిగా దుర్గాప్రసాద్‌ సతీమణి చేసిన వినతిని జగన్‌ పట్టించుకోలేదు. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఇస్తామని వారికి తెలియజేసారు! తిరుపతి అభ్యర్థి కోసం జరుగుతున్న అన్వేషణలో "ఎవరో ఎందుకు ? తన ఫిజియో థెరఫిస్ట్‌ ‘గురు’నే ఎంపిక చేస్తే పోలా?" అని భావించి, అదే విషయాన్ని జగన్‌ పార్టీ నేతల చెవిలో వేశారు.వారు కూడా సరే అన్నారు ! బాపట్లకు చెందిన అత్యంత సమాన్యుడైన నందిగం సురేష్ పార్లమెంట్ మెట్లెక్కించిన జగన్, ఇప్పుడు గురును కూడా అదే ఆలోచనతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది! తన పాదయాత్ర ముగిశాక ఇదే గురుమూర్తిని తనతోనే ఉండిపోవాలని జగన్‌ కోరగా,ఇంటి వద్ద మాట్లాడుకుని వస్తాను సార్ అంటూ వెళ్లిన గురుమూర్తి,వెనుదిరిగి వస్తే జగన్‌ను కలవడానికి అనుమతి దొరక్కఆపసోపాలు పడ్డారు. జగన్‌ ఓసారి ఎక్కడికో విమానంలో వెళ్తున్నారని తెలుసుకున్న గురుమూర్తి అదే విమానానికి టికెట్ తీసుకుని,ఆవిమానంలోకి ప్రవేశించి జగన్‌కు కనిపించారట! "ఏమయ్యావు?" అనే ప్రశ్నతో గురు కలవడానికి పడిన ఇబ్బంది చెప్పడంతో,జరిగింది గ్రహించిన జగన్‌ సరే అని గురుకు ఓ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడేమో ఏకంగా ఎంపీ ఉద్యోగమే గురుమూర్తికి జగనన్న ఇవ్వబోతున్నారు! తనను నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా కాపాడుకునే వాడే నిజమైన నాయకుడు!

11 views