త్వరలో పెరగనున్న ఆంధ్ర రాష్ట్ర పోలీసు కమిషనరేట్లు.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పోలీస్ కమిషనరేట్లే ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలల్లో మాత్రమే పోలీస్ కమిషనర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య మూడింతలుగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు పోలీస్ కమిషనర్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అలాగే- పోలీస్ యూనిట్లను కూడా పెంచుతారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 పోలీస్ యూనిట్లు ఉండగా.. వాటి సంఖ్యను 29కు పెంచుతారని చెబుతున్నారు.

4 views