నవంబర్ 26 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.


కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక ,ఉద్యోగ,రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, కేంద్ర జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి సీఆర్ మోహన్ అన్నారు.ఈసందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నదని, దీనిని తిప్పికొట్టాల్సిన భాద్యత కార్మికుల మీద కూడా ఉన్నదని సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని కోరారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు,వరహాలు,సుబ్బాయమ్మ, రామారావు,రతయ్య తదితరులు పాల్గొన్నారు.

6 views