నేషనల్ స్కాలర్షిప్ ఆన్ లైన్ నమోదు గడువు నవంబర్ 30 వరకు (30-11-2020)

జిల్లాలోని యావన్మంది ప్రధానోపాధ్యాయులు వారికి తెలియచేయునది ఏమనగా, ఒకటవ తరగతి నుండి పదవ తరగతి (ప్రీ మెట్రిక్), ఇంటర్ మరియు ఆపైన (పోస్ట్ మెట్రిక్), మెరిట్ కం మీన్స్ (ప్రొఫెషనల్ కోర్సెస్) విద్యనభ్యసిస్తున్న మైనారిటీ (ముస్లిం, దూదేకుల, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు మరియు పరిసిన్స్) విద్యార్థులు ఇంకనూ స్కాలర్షిప్స్ కై జిల్లా వ్యాప్తంగా ఫ్రెష్ విద్యార్థులు 14000 మరియు రెనివల్స్ 8000 మంది అనగా మొత్తం 22000 మంది విద్యార్థులు దరఖాస్తు చేయుకోవలసియున్నదని. శ్రీయుత జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి, అనంతపురము వారు తెలియచేసినారు మరియు స్కాలర్షిప్స్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీని 30.11.2020 వ తేది వరకు పొడిగించి ఉన్నారని తెలియచేసారు. సదరు విషయము లేఖ మరియు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఇదివరకే మండల విద్యాధికారులకు మరియు వారి ద్వారా జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది. అయినను స్కాలర్షిప్ ఫ్రెష్ మరియు రేనేవాల్స్ నమోదు ఆన్ లైన్ లో చాలా తక్కువ గా ఉన్నది. కాబట్టి వెంటనే విద్యార్థులకు తెలియ పరచి NSP Portal నమోదు చేసుకోవాల్సిందిగా కొరడమైనది.


జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా స్కూల్స్ లాగిన్ లో ఉన్న ఫ్రెష్ 5000 మరియు రేనేవాల్స్ 7200 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. కావున అప్లికేషన్ పరిశీలించి వెంటనే జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ కు ఫార్వార్డ్ చేయవలసిందిగా కొరడమైనది. మరియు ప్రధానోపాధ్యాయుల స్కూల్ లాగిన్ లో ఉన్న అప్లికేషన్ రోజు వారిగా పరిశీలించి వెంటనే జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ కు ఫార్వార్డ్ చేయవలసిందిగా కొరడమైనది.


.

0 views