పట్టణంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.


దళిత చైతన్య స్రవంతి, మాలమహానాడు సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. బడుగు బలహీన వర్గాలైన sc,st,bc, మైనారిటీ ప్రజల రాజ్యాధికారమే భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇదే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయం. దేశములో 85% గా ఉన్న ఎస్సి, ఎస్టీ,బిసి,మైనారిటీ వర్గాల ప్రజలు తమ ఓటు తమకే వేసి రాజ్యాధికారం చేపట్టడమే భారత రాజ్యాంగం లక్ష్యమని అదే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్య ఆశయమని దళిత చైతన్య స్రవంతి అధ్యక్షులు నల్లపు కోటేశ్వరరావు తెలిపారు. గురువారం పట్టణంలోని శారదా హైస్కూల్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహాం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దళిత చైతన్య స్రవంతి, మాలమహానాడు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య గ్రంధం భారత రాజ్యాంగం అని కొనియాడారు. రాజ్యాంగ ప్రతిని ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలని అన్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నినాదాలు చేస్తూ ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో స్రవంతి సభ్యులు ఎడ్ల వినీల్, అన్నలదాసు బుల్లి, బత్తుల విక్రమ్, కుడారి సోను, న్యాయవాది పేరము నగేష్, మాలమాహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు ఎడ్ల సురేష్, సభ్యులు పంబా రాజేష్, కొర్రపాటి రాంబాబు, భూపతి సునీల్, యల్లమండ, మణి, తదితరులు పాల్గొన్నారు.

8 views