ప్లాస్టిక్ కవర్లు అమ్మితే కఠిన చర్యలు : మన లోకల్ మునిసిపల్ కమిషనర్

పట్టణంలోని మార్కెట్ ప్రాంతాల్లో శుక్రవారం మన లోకల్ మునిసిపల్ కమిషనర్ డీ. రవీంద్ర సిబ్బందితో కలిసి నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాల పై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగాకమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ ను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొదటి తప్పుగా జరిమానా విధిస్తామని రెండొవ సారి అదే తప్పు చేస్తే షాపును సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు. వీరితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు.

13 views