ఫ్లాష్ ఫ్లాష్ News:ఇంటర్ తరగతులు ప్రారంభం వాయిదా..!


ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థలు, పాఠశాలలు నవంబరు 2 నుంచి పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇంటర్‌ మొదటి ఏడాది తరగతుల పునఃప్రారంభం మళ్ళీ వాయిదా పడింది. మొదటిగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఒక్కో సెక్షన్‌కు అనుమతించే విద్యార్థుల సంఖ్యను 88 నుంచి 40కి తగ్గించడాన్ని ప్రైవేటు యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేయడంతో ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో జాప్యం నెలకొంది. కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో తరగతుల పునఃప్రారంభం వాయిదా పడింది.


ఇదిలా ఉండగా, ఆన్‌లైన్‌ ప్రవేశాల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఇష్టారాజ్యంగా పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారు. కాసేపు ప్రవేశాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పెట్టి, ఆ తర్వాత దానిని తొలగిస్తున్నారు. నిలిపివేసినట్లు పేర్కొన్నా వెబ్‌సైట్‌ యథావిధిగానే పనిచేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది ఆప్షన్స్ ఇచ్చారు. వాస్తవానికి ఏటా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ లో చేరుతారు. ఈ లెక్కన మరో రెండు లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌కు దూరంగానే ఉన్నారు.


కాగా.. ఇంటర్ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియను నవంబరు 10 వరకు నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్ణయాన్ని అడ్డుకోవాలని, గత విధానంలోనే అడ్మిషన్లు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని పలు కాలేజీలు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి ముందస్తు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ ప్రభుత్వం జారీ చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు.


2 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ