బెంగ‌ళూరులో టెక్ స‌మ్మిట్‌.. ప్రారంభించనున్న ప్ర‌ధాని


క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో నేటి నుంచి మూడు రోజుల‌పాటు టెక్ స‌మ్మిట్‌-2020 జ‌రుగ‌నుంది. ఈ స‌ద‌స్సును ప్ర‌ధాని మోదీ ఇవాళ వీడియోకాన్ఫ‌రెన్స్ ప్రారంభించ‌నున్నారు. క‌రోనా త‌ర్వాత మాన‌వాళికి ఎదుర‌య్యే స‌వాళ్లు, ఐటీ, బ‌యోటెక్నాల‌జీ అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌దస్సులో ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్, స్విస్‌ కాన్ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గై పార్మెలిన్‌తో పాటు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, ప‌రిశోధ‌కులు, ఆవిష్క‌ర్త‌లు, విద్యావేత్త‌లు పాల్గొంటారు. క‌ర్ణాట‌క ఇన్నోవేషన్ అండ్‌ టెక్నాలజీ సొసైటీ (కిట్స్‌)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ఈ ఏడాది ‘నెక్ట్స్‌ ఈజ్‌ నౌ’ థీమ్‌తో ఈ స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది.3 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ