మన లోకల్ ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు కొండ‌వీడు అభివృద్ధి ప‌నులు పర్యవేక్షణ.*శ‌ర‌వేగంగా కొండ‌వీడు అభివృద్ధి* *వ‌చ్చేనెలాఖ‌రునాటికి అన్ని ప‌నులు ఆరంభం* *కొండ‌వీడుకు ప‌ర్యాట‌కుల తాకిడి బాగా పెరిగింది* *కొన‌సాగుతున్న‌ పిల్ల‌ల పార్కు, పార్కింగ్ ఏరియా అభివృద్ధి, బురుజుల నిర్మాణం, మొక్క‌ల పెంప‌కం త‌దిత‌ర ప‌నులు* *కొండ‌వీడు అభివృద్ధిలో అధికారుల చొర‌వ అభినంద‌నీయం* *అట‌వీశాఖ బాధ్య‌త‌గా ప‌నిచేస్తోంది* *చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని కితాబు* *కొండ‌వీడు న‌గ‌ర‌వ‌నం అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీల‌న* *మొక్క‌లు నాటి ప్లాంటేష‌న్ కార్య‌క్రమాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన ఎమ్మెల్యే* కొండ‌వీడు అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. వ‌చ్చే నెలాఖ‌రునాటికి మ‌రికొన్ని ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు. జిల్లా అట‌వీశాఖ అధికారి ఎం.శివ‌ప్ర‌సాద్‌ గారితోపాటు ఆ శాఖ‌‌కు చెందిన ఇత‌ర సిబ్బందితో క‌లిసి ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారు శుక్ర‌వారం కొండ‌వీడులో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వ‌చ్చే నెలాఖ‌రునాటికి కొండ‌వీడులో చాలా వ‌ర‌కు అభివృద్ధి ప‌నులు మొద‌లవుతాయ‌ని చెప్పారు. డిసెంబ‌ర్ నెల రెండో వారంలో అట‌వీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి గారి చేతుల‌మీదుగా ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌కు ప్ర‌ణాళిక రూపొందించామ‌ని చెప్పారు. ప్ర‌వేశ ద్వారం, పుట్ట‌మ్మ‌చెరువు వాచ్ ట‌వ‌ర్‌, సైన్ బోర్డుల ఏర్పాటు లాంటి ప‌నుల‌ను ఈ సంద‌ర్భంగా చేప‌ట్ట‌నున్నామ‌ని తెలిపారు. థీమ్‌పార్కు ఏర్పాటు, పెయింట్లు, వాట‌ర్ ట్యాంక్‌, సోలార్‌లైట్లు త‌దిత‌రాలు ఇప్పుడు చేప‌డుతున్నామ‌న్నారు. ఇప్ప‌టికే కొండపై బురుజుల నిర్మాణం పూర్తికావ‌స్తోంద‌ని చెప్పారు. పిల్ల‌ల పార్కు, పార్కింగ్ ఏరియా అభివృద్ధి ప‌నులు నాలుగు రోజుల కింద‌టే ప్రారంభ‌మై వేగంగా కొన‌సాగుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌య నిర్మాణం కూడా పూర్త‌యింద‌ని, విగ్ర‌హ ప్ర‌తిష్ట త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని చెప్పారు. కొండ‌వీడును ప్ర‌పంచ‌స్థాయి ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప‌ర్యాట‌కు సంఖ్య బాగా పెరిగింద‌ని చెప్పారు. అందుకు త‌గిన‌ట్లుగా వ‌స‌తులు పెంచే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని తెలిపారు. అట‌వీశాఖ అధికారులు బాధ్య‌త‌తో ప‌నిచేస్తున్నార‌ని, కొండ‌వీడు అభివృద్ధిలో నిమగ్న‌మై ఉన్నార‌ని కితాబిచ్చారు. *రూ.1.5కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు* కొండ‌వీడు అభివృద్ధి కోసం అట‌వీశాఖ త‌ర‌ఫున రూ.12 కోట్ల వ‌ర‌కు అంచ‌నాలు రూపొందించి ప్ర‌భుత్వానికి పంపామ‌ని జిల్లా అట‌వీ అధికారి ఎం.శివ‌ప్ర‌సాద్ తెలిపారు. ఇప్ప‌టికే రూ.1.5 కోట్లు మంజూర‌య్యాయ‌ని, ఆ మొత్తంతో ప‌లు అభివృద్ధి ప‌నులు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. వ‌చ్చే నెల‌లో కొండ దిగువ‌న ఘాట్ రోడ్డు ఆరంభంలో ప్ర‌వేశ‌ద్వారం నిర్మాణం కోసం రూ.20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌బోతున్నామ‌న్నారు. అక్క‌డే చెక్‌పోస్టు ఏర్పాటుచేస్తామ‌న్నారు. సీసీ కెమెరాల‌తో కూడిన చెక్‌పోస్టు వ‌చ్చే నెల నుంచి ఆరంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. మొక్క‌ల పెంపకం, వాచ్‌ట‌వ‌ర్ నిర్మాణం కోసం రూ.25ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు చెప్పారు. సైన్‌బోర్డుల ఏర్పాటు, ప‌ర్యాట‌కుల కోసం టాయిలెట్ల నిర్మాణానికి మొత్తం 12 ల‌క్ష‌లు వెచ్చిస్తున్నామ‌న్నారు. కొండ‌పై బోర్లు, వాట‌ర్ ట్యాంకు, శుద్ధ జ‌లం త‌దిత‌రాల కోసం రూ.26 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ట్లు చెప్పారు. ఈ ప‌నుల‌న్నీ ప్ర‌స్తుతం జ‌రుగుతున్నాయ‌న్నారు. మొక్క‌ల పెంప‌కానికే రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేస్తున్న‌ట్లు చెప్పారు. ఓపెన్ యాంపీ థియేట‌ర్‌, ఫెన్సింగ్, చెరువుల్లో బోటింగ్‌, సోలార్ లైటింగ్ త‌దిత‌ర ప‌నుల‌న్నీ రెండు, మూడు రోజుల్లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పారు. అనంత‌రం ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్క‌లు నాటించారు. కార్య‌క్ర‌మంలో ఎడ్లపాడు తహసిల్దార్ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా విఘ్నేశ్వర రెడ్డి,ఎడ్లపాడు మండల జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు,ఎడ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సుభాని,ఎడ్లపాడు మండల వై.యస్.అర్.సీపీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాగర్,ఎడ్లపాడు ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస నాయక్,పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పట్టణ ముస్లిం,మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,మునిసిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు, బోయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు నరసింహ రాజు,పుట్టకోట గ్రామ పార్టీ అధ్యక్షుడు మానం సాంబయ్య, సుబ్బారావు,కొప్పుల శ్యాం పాల్, వలేటి ఉదయ కిరణ్,నకిరికంటి శ్రీకాంత్,మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.