మన లోకల్ చిలకలూరిపేట MLA శ్రీమతి విడదల రజని గారి పాదయాత్ర.


*జ‌గ‌న‌న్న‌తోనే రాష్ట్రం సుభిక్షం* *అంద‌రి అండ‌దండల‌తో స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న అందిస్తున్నాం* *రాష్ట్రంలో నేడు ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక సంక్షేమ ప‌థ‌కం ల‌బ్ధిదారే* *అంద‌రికీ సాయం అందిస్తున్న ఘ‌న‌త మ‌న ప్ర‌భుత్వానిదే* *తొమ్మిదో రోజు చిల‌క‌లూరిపేటలో 7 కిలో మీట‌ర్ల మేర కొన‌సాగిన పాద‌యాత్ర‌* *మొత్తం మీద 50 కిలోమీట‌ర్ల పాటు సాగిన న‌డ‌క‌* *భారీగా త‌ర‌లివ‌చ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు* రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. ప్ర‌జ‌ల‌లో నాడు.. ప్ర‌జ‌ల కోసం నేడు కార్య‌క్ర‌మంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాచైత‌న్య యాత్ర ఆదివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. పాద‌యాత్రలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎమ్మెల్యే గారు 50 కిలోమీట‌ర్ల వ‌ర‌కు న‌డిచారు. య‌డ్ల‌పాడు మండలం ఉన్న‌వలో ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఆయా మండ‌లాల్లోని ప‌లు గ్రామాల మీదుగా సాగి చిల‌క‌లూరిపేట‌కు చేరుకుంది. ప‌ట్ట‌ణంలో ఆదివారం 7 కిలోమీట‌ర్ల మేర న‌డ‌క సాగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్ర‌జలంద‌రి అండ‌దండ‌ల‌తో స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలోని దాదాపు ప్ర‌జ‌లంతా ఏదో ఒక సంక్షేమ ప‌థ‌కం ల‌బ్ధిదారేన‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక ప‌థ‌కం రూపంలో సాయం అందిస్తున్న గొప్ప ప్ర‌భుత్వం మ‌న‌దేన‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌ను అంద‌లం ఎక్క‌డిస్తున్న సీఎం వైఎస్ జ‌గ‌న్ అని కొనియాడారు. అన్ని వ‌ర్గాల వారికి ప్ర‌త్యేకంగా ప‌థ‌కాలు రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. లానేస్తం, నేత‌న్న నేస్తం, వాహ‌న‌మిత్ర‌, జ‌గ‌న‌న్న చేదోడు, వైఎస్సార్ ఆస‌రా, వైఎస్సార్ చేయూత‌, రైతు భ‌రోసా, డ్వాక్రా రుణాల మాఫీ, బీసీ కార్పొరేష‌న్ల ఏర్పాటు, అమ్మ ఒడి, కాపునేస్తం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి ఆర్థిక‌సాయం అంద‌జేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని వివ‌రించారు. *పాద‌యాత్ర సాగిందిలా* ప‌ట్ట‌ణంలోని గుర్రాల చావిడి దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గ‌రి నుంచి తొమ్మిదో రోజు పాద‌యాత్ర మొద‌లైంది. తూర్పు మాలపల్లి, సూదవారిపాలెం,శారదా హైస్కూల్, పెదనందిపాడు రోడ్డులో నుంచి దాస‌రి కాల‌నీ, మారుతి నగర్, రెహమత్ నగర్, మద్దినగర్, కక్కెరదాసు గూడాలు, పాటి మీద, బొందిలిపాలెం, వడ్డెరపాలెం, గుండయ్య తోట, రాగన్నపాలెం మీదగా సుభాని నగర్ లోని వైఎస్సార్ విగ్ర‌హం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించారు. దారిపొడవునా ఎమ్మెల్యే రోడ్డుకిరువైపులా బారులు తీరి ఉన్న మ‌హిళ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ ముందుకుక‌దిలారు. స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌నితీరుపై సంతృప్తి వ్య‌క్తంచేస్తూ క‌నిపించారు. *గ‌జ‌మాల‌లు, గుర్ర‌పు బండ్లు* పాద‌యాత్ర ప్రారంభంలో చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ అభ్య‌ర్థి కొలిశెట్టి శ్రీనివాస‌రావు 20 అడుగుల గ‌జ‌మాల‌తో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారిని స‌త్క‌రించారు. పాద‌యాత్ర దారిపొడ‌వునా గుర్ర‌పు బండ్లు సంద‌డి చేశాయి. డీజే, తీన్‌మార్ ధ్వ‌నులు పుర‌వీధుల్లో మార్మోగాయి. ప‌ట్ట‌ణం జ‌గ‌న్నినాదాల‌తో హోరెత్తింది. పాద‌యాత్ర ఆసాంతం బాణ‌సంచా పేలుళ్లు మోత‌పుట్టాయి. దారిపొడ‌వునా పూల‌వ‌ర్షం కురిసింది. ముఖ్యంగా యువ‌తీయువ‌కులు ఉత్సాహంగా పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వంద‌లాదిగా రెప‌రెప‌లాడాయి. నియోజ‌క‌వ‌ర్గ‌వ్యాప్తంగా వేలాదిగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. వీధుల‌న్నీ జ‌న‌హోరుతో నిండిపోయాయి. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని అల్పాహారంతోపాటు భోజ‌నం కూడా నాయ‌కుల ఇళ్ల‌లోనే చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు బషీర్ మేస్త్రి, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వర రెడ్డి రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్యదర్శి అల్లిమియా,పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షుడు దేవినేని శంకరరావు,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, పట్టణ ముస్లిం, మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, ఉపాధ్యక్షుడు యూసుఫ్ ఖాజా వలి, బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరంజనేయులు,యస్.సి సెల్ అధ్యక్షుడు బండారు వీరయ్య,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్,కౌన్సిలర్ అభ్యర్థులు ఎడ్ల ఇందిర,చింతపల్లి విల్సన్, షేక్ మీరాబి,షేక్ జమీలా,జాలాది సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి,నయబ్ సైదాబి,నసీమా బేగం,షేక్ రఫాని,తోట నాగలక్ష్మి,చెంబేటీ భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, ములకలూరి బాజి మున్నీ, యూసుఫ్ ఆలీ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.