వక్ప్ బోర్డు ఆదాయం నుంచే ఇమాం, మౌజాన్ లకు వేతనం ఇస్తారు.. ప్రభుత్వ ఖజానా నుంచి కాదు...జానోజాగో సంఘం

తెలుగు రాష్ట్రాల్లో మౌజాన్, ఇమాంలకు ఇచ్చే వేతనం ఖజానా నుంచి ఇస్తున్నారని, ముస్లింల పట్ల ప్రభుత్వాలు ఉధారంగా వ్యవహరిస్తున్నాయని కొందరు దుష్ప్రాచారం చేస్తున్నారని జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం పేర్కొంది. ఈ మేరకు జానోజాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్, జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర గౌరవ సలహాదారు షేక్ అబ్దుల్ రజాక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ముంతాజ్ ఫాతిమా, ఏపీ రాష్ట్ర సమన్వయకర్త షేక్ గౌస్ బాషా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

అంటే మౌజాన్, ఇమాంలకు ఇచ్చే గౌరవ వేతనం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి సంబంధంలేదని వారు పేర్కొన్నారు. పైగా వక్ప్ సంస్థలను కాపాడి, వాటి ఆస్తుల ఆధాయం పెంపునకు చర్యలు తీసుకొనే అవకాశముందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా వక్ప్ ఆస్తుల అద్దెలు, ఇతర అంశాలపై ఆ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల అజమాయీషీ కొనసాగుతుందన్నారు. నామ మాత్రపు అద్దెలు విధించి వక్ప్ ఆధాయం తగ్గేందుకు కొందరు దళారులు కారణమవుతున్నారని వారు పేర్కొన్నారు.


3 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ