సరిహద్దుల వెంట పాక్‌ కాల్పులు.. ముగ్గురు జవాన్లు వీరమరణం.

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దుల వెంట కాల్పులకు పాకిస్థాన్ తెగబడింది, జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో జరిపిన దాడిలో పలువురు పౌరులు కూడా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.


పాకిస్థాన్ కాల్పుల ను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్‌ బంకర్లు, ఇంధన ట్యాంకులు, లాంచ్‌ ప్యాడ్‌లను భారత ఆర్మీ పేల్చివేసింది. ఈ దాడుల్లో దాదాపు ఎనిమిది మంది పాకిస్థాన్‌ సైనిక సిబ్బంది హతమయ్యారు. వీరిలో పాకిస్థాన్‌ ఆర్మీ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ)కి చెందిన ముగ్గురు కమాండోలు ఉన్నారని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరో 10 నుంచి 12మంది పాకిస్థాన్‌ ఆర్మీ సిబ్బందికి తీవ్ర గాయాలపాలయ్యారు.


9 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ