సీఎంను ఇరికిస్తే కేసు నుంచి తప్పిస్తాం..బంపర్ ఆఫర్కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. జులై 5 తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి కేరళకు రూ.14.82 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి స్వప్న సురేష్ అరెస్టైన విషయం తెలిసిందే.

అయితే కేసు విచారణలో భాగంగా కేరళ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న స్వప్న సురేషన్ ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ హస్తం ఉందని ఒప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని, అందుకు ఒప్పుకుంటే ఈకేసు నుంచి బయటపడేస్తామని హామీ ఇచ్చినట్లు, అందుకు తాను ఒప్పుకోలేదంటూ స్వప్న సురేష్.. దుబాయ్ కు చెందిన ఓ వ్యక్తి తో ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ సందర్భంగా డీజీపీ రిషిరాజ్ సింగ్ మాట్లాడుతూ జైల్లో శిక్షను అనుభవిస్తున్న స్వప్న ఫోన్ లో ఎలా మాట్లాడుతుందని అనుమానం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న ఆడియోలు, కొద్దిరోజుల క్రితం జైలుకు వచ్చిన స్వప్న తల్లిదండ్రుల్ని విచారిస్తున్నట్లు తెలిపారు.

25 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ