సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులు

*బీజేపీ ప్రభుత్వం మీద కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలి* సీపీఐ ఏరియా కార్యదర్శి cr మోహన్*కేంద్రంలో ఉన్న బిజిపి ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు, ప్రజా వ్యతిరేక విధానాల పై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా *చిలకలూరిపేట* లో కార్మికులందరూ సమావేశంలో పాల్గొన్న అనంతరం ర్యాలీ నిర్వహించారు.సీపీఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ మాట్లాడుతూ కార్మికులను,రైతులను,పేద ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద కార్మికులందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. దశాబ్దాల కాలం నుండి సాధించుకున్న 44 చట్టాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బొగ్గు, రైల్వే, విమాన తదితర రంగాలను ప్రైవేటు సంస్థలకు పెట్టుబడిదారీ వర్గాలకు అప్పజెప్పి ఊడిగం చేసే పనిలో పడిందని ఈ ప్రయత్నాలను నిలువరించడానికి కార్మికులందరూ సమైక్యంగా పోరాడాలని, కార్మిక, ప్రభుత్వ ఉద్యోగులు, అందరూ పాల్గొనడం జరిగింది అని తెలియజేశారు ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు అయిన ఈ 18 నెలల కాలంలో కార్మికుల, భార్య లేదా కుమార్తెల ప్రసూతి సహాయం మరియు కుమార్తెల వివాహాలకు సంబంధించి ,మరణించిన కార్మికులకు ఇవ్వవలసిన ఆర్థిక సహాయం నిలిపివేసినదన్నారు. అంతేకాకుండా కొత్తగా సంక్షేమ పథకం కార్డు కొరకు దరఖాస్తు చేసుకునేవారికి అవకాశం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం జీవో పాస్ చేసి నిలువరించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గత 18 నెలల నుంచి పెండింగ్లో ఉన్న క్లెయిములు పరిష్కరించి ,ఇసుక ఇబ్బందులు వల్ల మరియు కరోనా లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటించిన కార్మికులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, 60 సంవత్సరములు నిండిన ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుబ్బాయమ్మ, aiyf జిల్లా కార్యదర్శి సుభాని, దాసరి వరహాలు,రామారావు,తుబటి సుభాని,సౌటుపల్లి నాగేశ్వరరావు, నాసర్, చెంచెయ్య,యెగయ్య, సురబయ్య ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

4 views