సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసు

సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు జడ్జీలపై అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. జడ్జీలు, కోర్టు తీర్పులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసింది. విశాఖలో 12 కేసులను సీబీఐ అధికారులు రిజిస్టర్ చేశారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసింది. వీరితోపాటు మరొకరి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. గతంలో సీఐడీ సైబర్ క్రైమ్ సెల్ నమోదు చేసిన కేసులనే యాధాతథంగా తీసుకొని కేసులు నమోదు చేసినట్లుగా సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నిందితులు ఫేస్ బుక్, ట్విటర్ తదితర మాధ్యమాల్లో జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు సీబీఐ గుర్తించింది. నిందితుల్లో ముగ్గురు విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు పేర్కొంది. సీబీఐ ఐటీ చట్టంలోని సెక్షన్ 154, 153ఏ, 504, 505 ప్రకారం సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ లను కలుపుతూ ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయనున్నట్లు సీబీఐ తెలిపింది. ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమలాదిత్య వెల్లడించారు. కేసు దర్యాప్తును సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ రావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

4 views

Recent Posts

See All

భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో తొలిసారిగా ఆన్ లైన్​లో ములాఖత్​లు స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘ఈ–ప్రిజనర్స్’ అమలులో భాగంగా మారుమూల ఏజెన్సీలోని మన్యం కేంద్రంలో ఉన్న సబ్ జైలులో జూ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ