15 ఏళ్ల యుద్ధం 26,000 మంది పిల్లలు బలి.

యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గానిస్తాన్‌లో గత 14 ఏళ్లుగా ప్రతి రోజూ సగటున ఐదుగురు చిన్నారులు చనిపోవడమో లేదంటే గాయపడడమో జరుగుతోందని ఒక స్వచ్చంద సంస్థ గుర్తించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2005 నుంచి 2019 వరకూ దాదాపు 26,025 మంది పిల్లలు ఘర్షణలకు ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురికావడం జరిగిందని ది చిల్డ్రన్ సంస్థ చెప్పింది.
సోమవారం జెనీవాలో జరగనున్న కీలక సమావేశానికి ముందు దేశంలో పిల్లల భవిష్యత్తును కాపాడాలని తమకు సాయం అందించే దేశాలను కోరింది. అమెరికా తన దళాలను వెనక్కు పిలిపించడం, శాంతి చర్చలు ఆగిపోవడంతో అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతోంది. సేవ్ ది చిల్డ్రన్ సంస్థ వివరాల ప్రకారం చిన్నారులకు అత్యంత ప్రమాదకరంగా మారిన 11 దేశాల్లో అఫ్గానిస్తాన్ కూడా ఒకటి.


అఫ్గానిస్తాన్‌లో నిరంతరం కొనసాగుతున్న హింస ప్రభావం దాదాపు దేశమంతటా ఉందని గత ఏడాది బీబీసీ పరిశోధనలో తేలింది.

4 views

Recent Posts

See All

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృ